Andhra Pradesh: ఏపీకి రూ. 879 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • రెవెన్యూ లోటు కింద నిధుల విడుదల
  • ఈ ఏడాది రూ. 10,549 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంచనా
  • ఈ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో విడుదల చేయనున్న కేంద్రం
Centre releases Rs 873 Cr to Andhra Pradesh

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊరటను కల్పించింది. రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 879.08 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ. 10,549 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. మిగిలిన మొత్తాన్ని మరో 11 విడతల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. 

దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంటు కింద కేంద్రం రూ. 7,183.42 కోట్లను విడుదల చేసింది. ఈ రాష్ట్రాలన్నింటికీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని 15వ ఆర్థిక సంఘం లెక్కించింది. ఈ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు.

More Telugu News