Gujarat Titans: ఐపీఎల్: రెండు కొత్త ముఖాలను బరిలో దించుతున్న గుజరాత్ టైటాన్స్

  • ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
  • ఇద్దరు కొత్తవాళ్లను బరిలో దించుతున్న టైటాన్స్
  • రాజపక్స స్థానంలో బెయిర్ స్టోను తీసుకువచ్చిన పంజాబ్
Gujarat Titans gives chance to two debutantes

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తుండగా, టైటాన్స్ కు అడ్డుకట్ట వేయాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది. ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

కాగా, ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులు చేసింది. ఆల్ రౌండర్ విజయ్ శంకర్, పేసర్ వరుణ్ లను జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో దర్శన్ నల్కండే, సాయి సుదర్శన్ లకు అవకాశమిచ్చారు. వీరిద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. దర్శన్ నల్కండే (23) విదర్భకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్. ఇక 20 ఏళ్ల సాయి సుదర్శన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 

ఇక, పంజాబ్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. భానుక రాజపక్స స్థానంలో జానీ బెయిర్ స్టో జట్టులోకి వచ్చాడు.

More Telugu News