Asaram Bapu: ఇటీవల తప్పిపోయిన బాలిక ఆశారాం బాపు ఆశ్రమంలో శవమై తేలిన వైనం!

Body of missing girl found in car parked inside Asaram Bapus ashram in UP
  • ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయిన బాలిక
  • యూపీలోని ఆశ్రమంలో గుర్తింపు
  • పార్క్ చేసి ఉన్న కారు నుంచి స్వాధీనం
  • ఆశ్రమానికి చెందిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు ఆశ్రమంలో మరో ఘోరం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన బాలిక ఆశ్రమంలో శవంగా తేలింది. ఉత్తరప్రదేశ్ లోని ఆశారాం బాపు ఆశ్రమంలో ఇది చోటు చేసుకుంది.

ఏప్రిల్ 5 నుంచి 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. సదరు బాలిక మృతదేహాన్ని ఆశ్రమంలో పార్క్ చేసి ఉన్న ఓ కారు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. ఆశ్రమానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దీనిపై విచారిస్తున్నారు. 

ఆశారాం బాపు తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఆధ్యాత్మికవేత్త. దేశవ్యాప్తంగా ఆయనకు ఆశ్రమాలున్నాయి. జోధ్ పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై ఆయన అత్యాచారం చేసినట్టు తేలడంతో 2018లో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆశారాం బాపూకి వ్యతిరేకంగా మరెన్నో అత్యాచార, ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జోధ్ పూర్ కారాగారంలో ఆశారం బాపు శిక్ష అనుభవిస్తున్నారు.
Asaram Bapu
ashram
UP
gilr
missing
body

More Telugu News