UNO: మాన‌వ హ‌క్కుల మండలి నుంచి రష్యా అవుట్‌.. ఐరాస ఓటింగ్‌కు దూరంగా భార‌త్‌

  • ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో జ‌రిగిన ఓటింగ్‌
  • తీర్మానానికి అనుకూలంగా 93 దేశాల ఓటు
  • వ్య‌తిరేకంగా 24 దేశాల ఓటు
  • ఓటింగ్‌కు దూరంగా భార‌త్ స‌హా 58 దేశాలు
UN General Assembly suspends Russia from Human Rights Council

ఉక్రెయిన్‌పై యుద్ధం కొన‌సాగిస్తున్న ర‌ష్యాకు గురువారం నాడు మ‌రో గ‌ట్టి ఎద‌రు దెబ్బ త‌గిలింది. ఐక్య‌రాజ్య స‌మితి గొడుగు కింద ప‌నిచేస్తున్న మాన‌వ హ‌క్కుల మండలి (హ్యూమ‌న్ రైట్స్ కౌన్సిల్‌) నుంచి ర‌ష్యా బ‌హిష్క‌ర‌ణ‌కు గురైంది. ఈ మేర‌కు ఐరాస స‌ర్వ ప్ర‌తినిధుల స‌భ (జ‌న‌ర‌ల్ అసెంబ్లీ) గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వ‌హించిన ఐరాస‌.. స‌భ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా ర‌ష్యాను మాన‌వ హ‌క్కుల మండలి నుంచి బ‌హిష్క‌రించింది. 

అయితే, ఈ ఓటింగ్‌కు భార‌త్ దూరంగా ఉండిపోయింది. ఈ ఓటింగ్‌లో పాల్గొన‌కుండా భార‌త్ త‌న త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబించింది. ర‌ష్యాను మాన‌వ హ‌క్కుల మండలి నుంచి బ‌హిష్క‌రించాల‌న్న తీర్మానంపై ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో జ‌రిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి. ఈ తీర్మానానికి వ్య‌తిరేకంగా 24 దేశాలు ఓటేయ‌గా... భార‌త్ స‌హా 58 దేశాలు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు.

More Telugu News