AP Cabinet: మంత్రుల రాజీనామా వేళ‌.. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

jagan comments on chandrababu in cabinet meeing
  • వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కమన్న జగన్ 
  • మ‌ళ్లీ ఓడితే చంద్ర‌బాబుకు రాజకీయ జీవితం ఉండ‌దని వ్యాఖ్య  
  • చంద్ర‌బాబును మ‌రోమారు ఓడించే బాధ్య‌త మీదేనన్న జగన్ 
త‌న కేబినెట్‌లోని మంత్రులంద‌రితో రాజీనామాలు చేయించే వేళ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసినట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. మ‌ళ్లీ ఓడిపోతే ఇక చంద్ర‌బాబుకు రాజ‌కీయ జీవితం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబును మ‌రోమారు ఓడించే బాధ్య‌త మీదేనంటూ కూడా జ‌గ‌న్ మంత్రుల‌కు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మంత్రుల‌తో స‌ర‌దాగా మాట్లాడిన జ‌గ‌న్‌.. వెయ్యి రోజుల పాటు మంత్రులుగా కొన‌సాగార‌ని పేర్కొన్నారు. ఇక మిగిలిన 700 రోజులు పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ఇన్ని రోజులు మంత్రులుగా ప‌నిచేసిన మిమ్మల్ని పార్టీ సేవ‌ల‌కు వినియోగించుకుంటామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
AP Cabinet
YS Jagan
YSRCP
Chandrababu

More Telugu News