Nagashourya: 'ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం' అంటూ జరుగుతున్న ప్రచారంపై నాగశౌర్య తల్లి వివరణ

Nagashourya mother clarifies there is no relativity with NTR family

  • ఎలాంటి బంధుత్వం లేదన్న ఉషా మూల్పూరి
  • లక్ష్మీప్రణతి కజిన్ కు నాగశౌర్య ఫ్రెండ్ అని వెల్లడి
  • ఎన్టీఆర్ అంటే నాగశౌర్యకు అభిమానమని వివరణ

ఇప్పుడున్న యువ హీరోల్లో నాగశౌర్య తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల నాగశౌర్య గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాగశౌర్యకు బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. 

ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మీ ప్రణతి కజిన్, నాగశౌర్య మంచి స్నేహితులు అని ఆమె వెల్లడించారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ తో బంధుత్వం అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అంటే నాగశౌర్యకు ఎంతో ఇష్టమని, వారి కుటుంబానికి నాగశౌర్య ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ లా మెలుగుతాడని పేర్కొన్నారు. 

నాగశౌర్య ప్రస్తుతం అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నాగశౌర్య తల్లి ఉష నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Nagashourya
NTR
Relativity
Lakshmi Pranathi
Cousin
Tollywood
  • Loading...

More Telugu News