Nagashourya: 'కృష్ణ వ్రింద విహారి' ఫస్టు సింగిల్ కి రిలీజ్ డేట్ ఖరారు!

Krishna Vrinda Vihari Movie Update

  • అనీష్ కృష్ణ  దర్శకత్వంలో 'కృష్ణ వ్రింద విహారి'
  • నాగశౌర్య సరసన షిర్లే సెటియా 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • కీలకమైన పాత్రలో రాధిక  

నాగశౌర్య ఒక వైపున యాక్షన్ సినిమాల పట్ల ఉత్సాహం చూపుతూనే, మరో వైపున ప్రేమకథా చిత్రాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి' రూపొందుతోంది. టైటిల్ ను బట్టి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.  

నాగశౌర్య సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన 'వర్షంలో వెన్నెల్లా' అనే పాటను ఫస్టు సింగిల్ గా వదలనున్నట్టు చెప్పారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. ఇందులో రాధిక ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న  నాగశౌర్యకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News