West Bengal: 'ఆట ముందుంది' అంటూ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష జ‌వాబు ప‌త్రాల్లో రాసిన ప‌శ్చిమ బెంగాల్ విద్యార్థులు

khela hobe students writes this slogan
  • గ‌త‌ నెలలో జరిగిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు
  • ‘ఖేలా హోబే’  (ఆట ముందుంది) అనేది టీఎంసీ నినాదం
  • చాలా మంది విద్యార్థులు దీన్ని రాయ‌డంతో అధికారుల సీరియ‌స్
పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు త‌మ రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (ఆట ముందుంది) అనే నినాదాన్ని రాశారు. మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు జ‌ర‌గ‌గా ప్ర‌స్తుతం ఆ పేప‌ర్ల‌ను ఉపాధ్యాయులు దిద్దుతుండ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విద్యార్థులు నినాదాలు రాసిన విషయాన్ని ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో అధికారులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జ‌వాబు ప‌త్రాల్లో ఇలా నినాదాలు రాసే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ నెలలో 12వ‌ తరగతి పరీక్షల నుంచే దీన్ని అమలు చేస్తామ‌ని తెలిపారు. పేపర్లలో ఇలా నినాదాలు రాయడం ప‌రీక్ష‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధమని చెప్పారు. అందుకే, ఇక‌పై ఇలా రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.
West Bengal
exams

More Telugu News