Telangana: 12.30 గంట‌ల వ‌ర‌కు స్కూళ్లు.. తెలంగాణ స‌ర్కారు ఆదేశం

  • గంట పాటు బ‌డుల స‌మయాన్ని కుదించిన తెలంగాణ‌
  • వారం పాటు విధించిన గ‌డువు బుధ‌వారంతో ముగింపు
  • రేప‌టి నుంచి య‌థాత‌థంగా 12.30 గంట‌ల వ‌ర‌కు బ‌డులు
telangana schools will work upto12 30 pm fromtomorrow

భానుడి ప్ర‌తాపంతో ఒంటి పూట బ‌డుల వేళ‌ల‌ను త‌గ్గించిన తెలంగాణ స‌ర్కారు..తిరిగి పాఠ‌శాల‌ల వేళ‌ల‌ను పెంచుతూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వేస‌వి ప్రారంభ‌మ‌వ‌డంతో ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఒంటి పూట బ‌డులు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఎండ‌లు ఒక్క‌సారిగా పెరిగిపోవ‌డంతో వారం పాటు బ‌డి వేళ‌ల‌ను ఉద‌యం 8 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే కుదించిన సంగ‌తి తెలిసిందే.

బ‌డుల ప‌నివేళ‌ల త‌గ్గింపు బుధ‌వారంతో ముగియ‌డంతో గురువారం నుంచి గ‌తంలో మాదిరిగానే ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పొడిగిస్తూ బుధ‌వారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ మేర‌కు రేప‌టి నుంచి అన్ని పాఠ‌శాల‌లు మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

More Telugu News