AIMIM: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మజ్లిస్ కార్పొరేటర్ అరెస్ట్

police arrests Majlis corporator Gousuddin
  • భో‌లక్ పూర్‌లో పోలీసుల‌పై విరుచుకుప‌డ్డ గౌసుద్దీన్‌
  • వైర‌ల్‌గా మారిన ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో
  • ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఉపేక్షించ‌రాద‌న్న కేటీఆర్‌
  • అరెస్ట్ చేసిన ముషీరాబాద్ పోలీసులు
పోలీసుల‌పై దురుసుగా ప్రవర్తించిన మజ్లిస్ నేత, భోలక్‌పూర్ కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధ‌రాత్రి త‌ర్వాత కూడా షాపులు తెరిచి ఉంచిన వైనాన్ని ప్ర‌శ్నించిన పోలీసుల‌పై గౌసుద్దీన్ విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ఈ త‌ర‌హా ఘ‌ట‌నల‌ను ఎంత‌మాత్రం ఉపేక్షించ‌రాద‌ని పేర్కొంటూ, చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీని కోరారు. 

దీంతో రంగంలోకి దిగిన ముషీరాబాద్ పోలీసులు గౌసుద్దీన్‌ను బుధ‌వారం అరెస్ట్ చేశారు. భోల‌క్ పూర్ ప్రాంతంలో సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత నైట్ పెట్రోలింగ్ కు వ‌చ్చిన పోలీసుల‌పై గౌసుద్దీన్ విరుచుకుప‌డిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పంద‌న‌తో పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.
AIMIM
Majlis Party
Majlis Corporator
Hyderabad Police

More Telugu News