Daggubati Purandeswari: మిత్రపక్షంగా పవన్‌ కల్యాణ్ మాతో చర్చిస్తే మేము కూడా స్పందిస్తాం: పురందేశ్వ‌రి

purandeshwari slams ysrcp
  • జ‌నసేన‌, బీజేపీ మ‌ధ్య‌ పొత్తు కొన‌సాగుతుంది
  • ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తాం
  • ఏపీ స‌ర్కారు విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం 
    అవుతున్నాయన్న‌ పురందేశ్వ‌రి
జ‌నసేన‌, బీజేపీ మ‌ధ్య‌ పొత్తుపై బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి స్పందించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన నిర్వ‌హిస్తోన్న కార్యక్రమాలు వేరైనా, ఇరు పార్టీల‌ మధ్య పొత్తు మాత్రం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. 

అయితే, మిత్రపక్షంగా జ‌నసేన అధినేత‌ పవన్‌ కల్యాణ్ త‌మతో చర్చిస్తే, తాము కూడా స్పందిస్తామని ఆమె చెప్పారు. ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ఏపీ స‌ర్కారు విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర స‌ర్కారుకి వివరిస్తామని తెలిపారు. 

Daggubati Purandeswari
BJP
YSRCP

More Telugu News