Vijayasai Reddy: ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల: విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యం

vijay sai slams tdp
  • ఆ కలను సాకారం చేసుకునేందుకు పగటి కలలు కంటున్నాడన్న విజయసాయి 
  • చంద్రబాబు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శ 
  • ఎల్లో కుల మీడియా దాన్ని బ్యానర్‌గా వేస్తోందని వ్యాఖ్య 
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ''ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు పగటి కలలు కంటున్నాడు. అక్షర దౌర్భాగ్యుడు చంద్రబాబు ఏది నోటికొస్తే అది మాట్లాడడం, ఎల్లో కుల మీడియా దాన్ని బ్యానర్‌గా వేయడం... 2024 ఎన్నికల వరకు ఇది తప్పేలా లేదు. తర్వాత ఎలాగూ పార్టీ లేదు... బొక్కా లేదనడం ఖాయం.

చంద్రబాబును ప్రజలు చెత్తలో తొక్కినప్పటి నుంచి నుంచి ఎల్లో మీడియాను పీడ కలలు వదలడం లేదు. శ్రీలంక మాదిరిగా రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటోంది. గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.08 లక్షలు. అంతకు ముందు ఏడాది కంటే రూ.31 వేలు పెరిగింది.. కనిపించట్లేదా?'' అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.
Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News