Andhra Pradesh: ఏపీలోని కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌ల కేటాయింపు

  • ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
  • లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు కేటాయించిన కేంద్రం
  • ఇకపై కొత్త కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు 
Union Government allots LGD Codes to AP new districts

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది.

ఇకపై ఈ కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు నడుస్తాయి. ముఖ్యంగా పంచాయత్ ఈ-పంచాయత్ మిషన్ మోడ్ కింద ఎంటర్‌ప్రైజ్ సూటీ (పీఈఎస్) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు. అలాగే, వివిధ రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లోనూ వీటిని వినియోగిస్తారు.

More Telugu News