Chennai: పరువునష్టం కేసు.. ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ

  • ఓ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్‌పై తీవ్ర ఆరోపణలు
  • పరువునష్టం దావా వేసిన ముకుంద్‌చంద్
  • విచారణకు హాజరుకాని సెల్వమణి
  • బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
Chennai court issues arrest warrant against director Selvamani and ex MLA Arul Anbarasu

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరిపై బోద్రా జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అయితే, ఆ తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు.

నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. సెల్వమణి, అరుళ్ అన్బరసులు విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, వారి తరపు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

More Telugu News