Janasena: వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం రాదు
  • వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్ర‌స‌క్తే లేదు
  • 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హ‌క్కే లేదు
  • ఎవ‌రి ప‌ల్ల‌కీ మోయ‌డానికి నేను రాలేదు
  • జ‌న‌సేన స‌మావేశంలో ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
pawan kalyan comments on 2024 elections

2024 ఎన్నిక‌ల‌లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అస‌లు వైసీపీకి ఓటు అడిగే హ‌క్కే లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌... 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. "వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్ర‌భుత్వం రాదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హ‌క్కు లేదు. ఇది కొత్త త‌రం రాజ‌కీయం. పాత త‌రం కాదు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్ర‌స‌క్తే లేద‌ని చాలా ఆలోచించి చెప్పా. శ్రీలంక‌లా ఏపీ అవ్వొద్ద‌నే ఆ మాట అన్నా. నా వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. వ్యూహం నాకు వ‌దిలేయండి చాలు. నేను ఎవ‌రి ప‌ల్ల‌కీ మోయ‌డానికి రాలేదు. ప్ర‌జ‌ల‌ను ప‌ల్ల‌కీ ఎక్కించేందుకే వ‌చ్చా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్నాం" అంటూ ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News