Samantha: సస్పెన్స్ థ్రిల్లర్ గా 'యశోద' .. రిలీజ్ డేట్ ఖరారు!

Yashoda movie  release date confirmed
  • 'యశోద'గా సమంత 
  • కీలక పాత్రలో వరలక్ష్మి
  • హరి - హరీశ్ దర్శకత్వం 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ  
  • ఆగస్టు 12న విడుదల
కొంత కాలంగా సమంత నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె చేసిన పాన్ ఇండియా సినిమా  'శాకుంతలం' ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులను జరుపుకుంటోంది.

ఇక నాయిక ప్రధానమైన కథతో సమంత చేసిన మరో సినిమానే 'యశోద'. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. హరి - హరీశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. 

మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, చంద్రబోస్  - రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో,  ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ ..  సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Samantha
Varalak shmi Sarath Kunmar
yashoda Movie

More Telugu News