Sree Vishnu: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా 'అల్లూరి' .. యంగ్ హీరో ప్రీ లుక్!

  • విభిన్నమైన చిత్రాలు చేస్తున్న శ్రీవిష్ణు
  • పరాజయం పాలైన 'అర్జున ఫల్గుణ'
  •  రిలీజ్ కి రెడీ అవుతున్న 'భళా తందనాన'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు  
Alluri  Pree look Poster released

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి 'అల్లూరి' అనే టైటిల్ ను ఖరారు చేసి, ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. 

బెక్కెం వేణుగోపాల్ - బబిత నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ అల్లుకున్న కథ. ఆ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. ఇంతవరకూ తను చేస్తూ వచ్చిన సినిమాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

'బ్రోచేవారెవరురా' తరువాత శ్రీ విష్ణు ఇక దూకుడు చూపిస్తాడని అనుకుంటే, 'తిప్పరా మీసం' .. 'గాలి సంపత్' సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఆ తరువాత 'రాజ రాజ చోర' ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ,' 'అర్జున ఫల్గుణ' దెబ్బకొట్టేసింది. త్వరలో 'భళా తందనాన'తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

More Telugu News