OnePlus 10 Pro 5G: వన్ ప్లస్ 10 ప్రో 5జీ అమ్మకాలు నేడే.. ఫీచర్లు ఇవే..!

  • అమెజాన్, వన్ ప్లస్ పోర్టళ్లపై విక్రయాలు
  • రెండు రకాల వేరియంట్లలో లభ్యం
  • వీటి ధరలు రూ.66,999, రూ.71,999
  • 32 నిమిషాల్లో పూర్తి చార్జింగ్
OnePlus 10 Pro 5G to go on sale today via Amazon

వన్ ప్లస్ తాజా ఆవిష్కరణ అయిన 10 ప్రో 5జీ విక్రయాలు మంగళవారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ గత వారమే భారత మార్కెట్లోకి విడుదలైంది. వన్ ప్లస్ 9ప్రోకు తర్వాతి వెర్షనే ఇది. వన్ ప్లస్ నుంచి అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే కానుంది.

వన్ ప్లస్ 10 ప్రో 5జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.66,999. 12 జీబీ, 256 జీబీ రకం ధర రూ.71,999. వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. 

6.7 అంగుళాల ఎల్టీపీవో డిస్ ప్లే, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. క్యూహెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కల్పించారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్ వాడారు. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంది. ఆక్సిజన్ ఓఎస్ 12.1, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తుంది. 

వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 789 ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సల్ శామ్ సంగ్ ఐఎస్ వో సెల్ జెఎన్1 సెన్సార్, 8 మెగాపిక్సల్ టెలిఫొటో షూటర్ ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సార్ ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ చార్జర్ సదుపాయాలతో వస్తుంది. 1 శాతం నుంచి 100 శాతం బ్యాటరీ చార్జింగ్ 32 నిమిషాల్లో పూర్తవుతుంది.

More Telugu News