Junior NTR: 'ఆర్ఆర్ఆర్'లో నా పాత్రపై ఎలాంటి అసంతృప్తి లేదు: జూనియర్ ఎన్టీఆర్

Rajamouli has given equal screen space to me and Ramcharan says Junior NTR
  • రాజమౌళిపై అసహనం వ్యక్తం చేస్తున్న తారక్ అభిమానులు
  • క్లైమాక్స్ లో చరణ్ పాత్ర డామినేట్ చేసేలా ఉందంటూ ఆగ్రహం
  • ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారన్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో సైతం ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. బాలీవుడ్ లో రూ. 200 కోట్ల వసూళ్లను సాధించే దిశగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. 

మరోవైపు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్ర ఎక్కువగా హైలైట్ అయిందని వారు మండిపడుతున్నారు. తారక్ కు రాజమౌళి తక్కువ స్పేస్ ఇచ్చారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చరణ్ పాత్ర డామినేట్ చేసేలా తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. తనకు, చరణ్ కు ఇద్దరికీ రాజమౌళి సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చారని తెలిపాడు. ఒక సీన్ లో తన పాత్రను ఎలివేట్ చేస్తే, మరో సీన్ లో చరణ్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని చెప్పాడు. తాను పోషించిన పాత్రపై తనకు ఎలాంటి అసహనం కానీ, అసంతృప్తి కానీ లేవని తెలిపాడు. ఇద్దరిలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని... అదే జరిగి ఉంటే 'ఆర్ఆర్ఆర్' ఇంత అద్భుతంగా వచ్చేది కాదని చెప్పాడు.
Junior NTR
Ramcharan
Rajamouli
RRR

More Telugu News