Andhra Pradesh: నేడు ఢిల్లీకి జగన్.. మోదీ, షాతో భేటీ

AP CM Jagan Visits Delhi today for two day tour
  • ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటన
  • సాయంత్రం మోదీతో, రాత్రికి షాతో సమావేశం
  • రేపు ఉదయం కేంద్రమంత్రులను కలిసి తిరుగు పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండురోజులపాటు దేశ రాజధానిలో పర్యటించనున్న జగన్ నేటి సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో, రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. వారి అపాయింట్‌మెంట్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది. 

ఏపీకి మూడు రాజధానుల ఆవశ్యకత, 26 జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశాన్ని ప్రధానికి జగన్ వివరించనున్నట్టు తెలుస్తోంది. పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, విభజన చట్టంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన హామీల గురించి కూడా ప్రధానితో చర్చిస్తారని సమాచారం.

రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ విషయం కూడా చర్చకు రావొచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ, షాతో భేటీ అనంతరం రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను జగన్ కలుస్తారు. అనంతరం ఏపీకి తిరిగి పయనమవుతారు.
Andhra Pradesh
Jagan
Narendra Modi
Amit Shah

More Telugu News