Radison Hotel: రాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు.. ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్సులు కూడా

telangana government cancels radison hotel licence
  • బంజారా హిల్స్ ప‌రిధిలో ర్యాడిస‌న్ హోట‌ల్‌
  • ఈ హోట‌ల్ పై అంత‌స్తులోనే డ్ర‌గ్స్ ల‌భించిన ప‌బ్‌
  • ఈ కార‌ణంగానే హోట‌ల్ లైసెన్స్ ఇత‌ర‌త్రా అనుమ‌తుల ర‌ద్దు
బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పబ్‌లో డ్ర‌గ్స్ ల‌భించిన కేసులో తెలంగాణ స‌ర్కారు కాసేప‌టి క్రితం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోలీసులు దాడి చేసిన ప‌బ్ ఉన్న‌, ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

బంజారా హిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ర్యాడిస‌న్ హోట‌ల్ పై అంత‌స్తులోనే డ్ర‌గ్స్ ల‌భించిన ప‌బ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌బ్‌పై పోలీసుల దాడి, కేసులో ప‌లువురు ప్ర‌ముఖుల బంధువుల పేర్లు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు కాసేపటి క్రితం ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేసింది. అంతేకాకుండా ఆ హోట‌ల్‌కు ఇచ్చిన ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్స్‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.
Radison Hotel
Drugs
Telangana Government
Pub

More Telugu News