SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

Sunrisers won the toss against LSG
  • ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్
  • సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
  • బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ జట్టు
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని విలియమ్సన్ వెల్లడించాడు. అటు, లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. దుష్మంత చమీర స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
SRH
LSG
Toss
IPL

More Telugu News