Mahesh Babu: మరో పసి హృదయానికి మహేశ్ బాబు చేయూత

Mahesh Babu helps Akhil Kumar who suffered with heart problem
  • వందల మంది చిన్నారులకు అండగా మహేశ్ బాబు
  • పలు ఆసుపత్రుల సహకారంతో హార్ట్ సర్జరీలు
  • కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న మహేశ్
  • తాజాగా రెండేళ్ల అఖిల్ కుమార్ కు సర్జరీ
  • కోలుకున్నాడన్న మహేశ్ బాబు ఫౌండేషన్
గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శస్త్రచికిత్సలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. 'మహేశ్ బాబు ఫౌండేషన్' ద్వారా పలు ఆసుపత్రుల భాగస్వామ్యంతో పసి హృదయాలకు ఆయన చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు సౌజన్యంతో కొన్ని వందల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు జరిగాయి. తాజాగా మరో పసి గుండెకు మహేశ్ ఆసరాగా నిలిచారు. 

హృద్రోగంతో బాధపడుతున్న అఖిల్ కుమార్ అనే రెండేళ్ల చిన్నారికి రెయిన్ బో హాస్పిటల్స్ సహకారంతో శస్త్రచికిత్స చేయించారు. దీనిపై మహేశ్ బాబు ఫౌండేషన్ ఓ ప్రకటన చేసింది. ఆ పసివాడు మళ్లీ ఆరోగ్యవంతుడు అవడానికి కారణమైన రెయిన్ బో హాస్పిటల్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వివరించింది. చిన్నారి అఖిల్ కుమార్ ఏప్రిల్ 1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని తెలిపింది.
Mahesh Babu
Akhil Kumar
Heart Surgery
Mahesh Babu Foundation
Tollywood

More Telugu News