MS Dhoni: కెప్టెన్సీ ఒత్తిడి లేదు.. ధోనీ నాకు కొన్ని నెలల ముందే చెప్పాడు: జడేజా

Mentally prepared after MS Dhoni told me few months back Jadeja
  • అప్పటి నుంచే సన్నద్ధం అయ్యాను
  • సహజసిద్ధంగా ఉండాలనుకుంటున్నాను
  • మీడియా ప్రశ్నలకు సీఎస్కే కెప్టెన్ స్పందన
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథి రవీంద్ర జడేజా.. కెప్టెన్ గా తాను ఒత్తిడిని ఎదుర్కోవడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ లో మూడు వరుస ఓటముల నేపథ్యంలో జడేజాకు ఈ ప్రశ్న ఎదురైంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ బాధ్యతలను విడిచిపెట్టాలని నిర్ణయించుకోవడంతో కొత్త బాధ్యతలను చేపట్టేందుకు తాను మానసికంగా సన్నద్ధమైనట్టు చెప్పాడు.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ తనకు కొన్ని నెలల ముందే చెప్పాడని జడేజా వెల్లడించాడు. కాకపోతే ఐపీఎల్ ఆరంభానికి రెండు రోజుల ముందు అధికారిక ప్రకటన వెలువడింది. కెప్టెన్సీ బాధ్యతల్లోకి రాక ముందు జడేజా బ్యాట్ తో, బాల్ తో మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ, సీఎస్కే కెప్టెన్ అయిన తర్వాత నుంచి ఐపీఎల్ లో తడబడుతున్నట్టు కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో డకౌట్ కావడం తెలిసిందే. 

‘‘ధోనీ కొన్ని నెలల ముందు చెప్పినప్పటి నుంచే నేను మానసికరంగా సన్నద్ధం అయ్యాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. సహజసిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. నా మనసులో వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నాను’’ అని జడేజా చెప్పాడు. 

MS Dhoni
Ravindra Jadeja
csk
captain
IPL
pressure

More Telugu News