Corona Virus: 715 రోజుల తర్వాత వెయ్యి దిగువకు వచ్చిన కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు.. అప్డేట్స్ ఇవిగో!

Indias daily Corona cases dropped below 1000 after 715 days
  • గత 24 గంటల్లో 913 పాజిటివ్ కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 1,316 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,597
మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 913 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 715 రోజుల్లో దేశ వ్యాప్తంగా ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య వెయ్యి దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 1,316 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 13 వేల దిగువకు యాక్టివ్ కేసులు పడిపోవడం 714 రోజుల్లో ఇదే ప్రథమం. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు 4,24,95,089 మంది కరోనా నుంచి కోలుకోగా... 5,21,358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు వరకు మొత్తం 1,84,70,83,279 డోసుల వ్యాక్సిన్ వేశారు.

Corona Virus
India
Updates

More Telugu News