Kurnool District: అమకతాడు టోల్‌గేటు వద్ద ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల వీరంగం.. ఉచితంగా పంపలేదని కర్రలతో సిబ్బందిపై దాడి: వీడియో వైరల్

AP MLA Sridevi followers attacked amakathadu toll plaza staff
  • ఎమ్మెల్యే కారును పంపి అనుచరుల కారును అడ్డుకున్న సిబ్బంది
  • కర్రలతో టోల్‌గేట్ సిబ్బందిని వెంబడించిన అనుచరులు
  • ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.. నమోదు కాని కేసు

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు చెలరేగిపోయారు. ఉచితంగా పంపనందుకు కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌గేటు సిబ్బందిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎమ్మెల్యే శ్రీదేవి నిన్న మధ్యాహ్నం కారులో కర్నూలు నుంచి డోన్ బయలుదేరారు. వెంట కాన్వాయ్ కూడా ఉంది. ఈ క్రమంలో అమకతాడు టోల్‌గేటు వద్దకు ఎమ్మెల్యే కారు చేరుకోగా గేట్లు తెరిచి ఆమె వాహనాన్ని పంపించారు. 

ఆ వెనకే ఉన్న శ్రీదేవి అనుచరులను మాత్రం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఐదుగురు వ్యక్తులు కారులోంచి దిగి టోల్‌ప్లాజా సిబ్బందిపై కర్రలతో విరుచుకుపడ్డారు. తమ కారును ఎందుకు పంపలేదంటూ దుర్భాషలాడారు. మరో వ్యక్తి అయితే సిబ్బందిని కర్రతో వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అయితే, ఫిర్యాదు మాత్రం నమోదు కాలేదు. కాగా, ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

  • Loading...

More Telugu News