Ramcharan: 'ఆర్ఆర్ఆర్' చీఫ్ టెక్నీషియన్లకు ఒక తులం బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan presents gold coins to RRR chief technicians
  • గత నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల
  • ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల కుంభవృష్టి
  • చీఫ్ టెక్నీషియన్లతో రామ్ చరణ్ బ్రేక్ ఫాస్ట్
  • కృతజ్ఞతాభినందనలు తెలియజేసిన వైనం
ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసింది. వారం రోజులు ముగిసేసరికి రూ.710 కోట్ల వసూళ్లతో పలు రికార్డులు తిరగరాసింది. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ఫిదా అవని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. 

తాజాగా, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన చీఫ్ టెక్నీషియన్లతో కలిసి అల్పాహారం సేవించారు. అంతేకాదు, వారికి ఒక తులం బంగారు నాణెం, స్వీట్లు కానుకగా ఇచ్చారు. తద్వారా తన కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రిపుల్ ఆర్ చిత్ర విజయానికి వివిధ విభాగాల నిపుణులు అందించిన సేవలను రామ్ చరణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించి, అభినందించారు.
Ramcharan
Gold Coins
RRR
Chief Technicians
Tollywood

More Telugu News