Allu Arjun: ముద్దుల తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun conveys birthday wishes to his son Allu Ayaan
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అయాన్
  • సోషల్ మీడియాలో స్పందించిన బన్నీ
  • ఫోటో షేర్ చేసిన వైనం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అర్హ, అయాన్ రూపంలో ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు ఉన్నారు. నేడు, అల్లు అయాన్ పుట్టినరోజు. తనయుడి జన్మదినం సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. 

"నా మమతల మణిహారం, నా ఆశల ప్రతిరూపం నా బిడ్డ అల్లు అయాన్. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత ఆనందం అయాన్ సొంతం కావాలని, ఆటపాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని ఆశిస్తున్నాను" అంటూ బన్నీ ట్వీట్ చేశారు. అంతేకాదు, తామిద్దరూ కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. బన్నీ, స్నేహారెడ్డిల రెండో సంతానం అల్లు అయాన్. 2014 ఏప్రిల్ 3న అయాన్ జన్మించాడు.
Allu Arjun
Allu Ayaan
Birthday
Wishes
Tollywood

More Telugu News