Strange Things: మహారాష్ట్రలో ఆకాశం నుంచి పడిన వింత వస్తువులు

Strange things fall down from sky in Maharashtra
  • చంద్రపూర్ జిల్లాలో ఘటన
  • నేలపై పడిన ఓ లోహపు రింగు, సిలిండర్ వంటి వస్తువు
  • చైనా రాకెట్ శకలాలంటున్న నిపుణులు
  • సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
మహారాష్ట్రలో గత రాత్రి ఆకాశం నుంచి రెండు వింత వస్తువులు నేల రాలడం కలకలం రేపింది. గగనతలం నుంచి మండుతున్న వస్తువులు భూమి దిశగా దూసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అదే సమయంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఓ లోహపు రింగు, సిలిండర్ వంటి వస్తువును స్థానిక ప్రజలు గుర్తించారు. 

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హనే స్పందించారు. ఆకాశం నుంచి పడిన వస్తువుల గురించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, ఇవి చైనా రాకెట్ చాంగ్ ఝెంగ్ 5బీ శకలాలు అయ్యుండొచ్చని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాకెట్ ను చైనా 2021లో ప్రయోగించింది.
.
Strange Things
Sky
Chandrapur District
Maharashtra
Rocket
China

More Telugu News