China: కరోనాతో చైనా, బ్రిటన్ విలవిల.. భారీగా కేసులు

China battles highest daily Covid 19 surge in 2 years UK hits record
  • బ్రిటన్ లో 49 లక్షల కేసులు
  • బీఏ.2 రకానివే అధికం
  • చైనాలో ఒక్క రోజే 13,146 కొత్త కేసులు
  • నియంత్రణకు కఠిన ఆంక్షల అమలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, ఈ మహమ్మారి ఇప్పుడప్పుడే కనుమరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇన్ఫెక్షన్ కేసులు బ్రిటన్ లో తారా స్థాయికి చేరాయి. ఆసుపత్రుల్లో చేరే వారు, మరణాల రేటు కూడా మరోసారి అధికంగా నమోదవుతోంది. ఎక్కువగా బీఏ.2 రకానివే ఉంటున్నాయి. మార్చి 26తో ముగిసిన వారంలో 49 లక్షల కేసులు వెలుగు చూశాయి.

మరోవైపు చైనా సైతం కరోనాతో ఎక్కువగా ఇబ్బంది పడుతోంది. అక్కడి అధికార యంత్రాంగం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆదివారం 13,146 కేసులు నమోదయ్యాయి. మొదటి విడతలో కరోనా కేసుల గరిష్ఠ స్థాయితో చూసినా ఇప్పుడు నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. కొత్త కేసుల్లో 70 శాతం షాంఘై నుంచే వస్తున్నాయి. జీరో కొవిడ్ పాలసీలో భాగంగా 2.7 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

దక్షిణ కొరియాలో శనివారం 2,64,171 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 74 లక్షల మందిని కరోనా పరీక్ష చేయించుకోవాలని అక్కడి సర్కారు ఆదేశించింది.
China
UK
Covid 19
cases

More Telugu News