rajzan: రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ, జ‌గ‌న్

modi jagan rajzan wishes
  • పేదలకు సేవ చేసేలా ప్రజల్లో రంజాన్ మాసం స్ఫూర్తిని కలిగించాలి
  • సమాజంలో శాంతి, సామరస్యాలు పెంపొందాలి: మోదీ
  • తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు
  • అల్లా దయతో అంతా మంచి జరగాలి: జ‌గ‌న్
రంజాన్ మాసం నేడు ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో ముస్లింలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జ‌గ‌న్‌ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్న‌ట్లు మోదీ చెప్పారు. సమాజంలో శాంతి, సామరస్యాలు, కరుణ పెంపొందాలని మోదీ అన్నారు. 

''రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని ఏపీ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు. కాగా, రంజాన్ నెల ప్రారంభమైన నేప‌థ్యంలో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు.
rajzan
Narendra Modi
Jagan

More Telugu News