IPL: ఇక 50 శాతం మంది ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్ లు

BCCI allows fifty percent occupancy for IPL matches
  • ఈసారి భారత్ లోనే ఐపీఎల్
  • తొలుత 25 శాతం మంది ప్రేక్షకులకే అనుమతి
  • కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన మహారాష్ట్ర
  • కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
  • ఏప్రిల్ 6 నుంచి కళకళలాడనున్న స్టేడియంలు
దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు 25 శాతం ప్రేక్షకులతోనే మ్యాచ్ లు నిర్వహించారు. అయితే, మహారాష్ట్రలో కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐపీఎల్ మ్యాచ్ లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ మేరకు ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు షురూ చేసినట్టు వెల్లడించింది. ఏదేమైనా ప్రేక్షకుల నడుమ సాగే క్రికెట్ మ్యాచ్ ల మజాయే వేరు. బీసీసీఐ తాజా నిర్ణయంతో స్టేడియంలు అభిమానులతో మళ్లీ కళకళలాడనున్నాయి. కాగా, బోర్డు తాజా నిర్ణయం ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుంది.
IPL
Crowds
Stadiums
BCCI
Corona Virus
India

More Telugu News