YS Jagan: జగన్ వీడియోను పోస్ట్ చేస్తూ బుద్ధా వెంకన్న కామెంట్

budda venkanna catches jagans slip comment
  • తాడేప‌ల్లి క్యాంపు ఆఫీసులో ఉగాది వేడుకలు 
  • ఉగాది వేడుక ప్ర‌సంగంలో త‌డ‌బ‌డ్డ జ‌గ‌న్‌
  • ఎద్దేవా చేస్తూ వెంకన్న కామెంట్ 
నేత‌ల త‌డ‌బాటు వ్యాఖ్య‌ల మీద టీడీపీ, వైసీపీ నేతలు చాలా కాలం నుంచి పరస్పరం ఎద్దేవా చేసుకోవడం చూస్తూనేవున్నాం. అందులో భాగంగా శ‌నివారం తెలుగు సంవత్స‌రాది ఉగాది సంద‌ర్భంగా కూడా ఇలాంటిదే క‌నిపించింది. ఉగాది సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వేదిక మీద కాసేప‌టి క్రితం ప్రారంభమైన ఉగాది వేడుక‌ల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీస‌మేతంగా హాజ‌రయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మైక్ అందుకున్న జ‌గ‌న్ ఉగాది అనే ప‌దాన్ని ప‌లికే సంద‌ర్భంగా త‌డ‌బ‌‌డ్డారు. "ఉబా ఉబా ఉబాది అంటూ ఆయ‌న ప‌లికారు. ఈ వ్యాఖ్య‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న.. క్ష‌ణాల్లో జ‌గ‌న్ మాట్లాడిన వీడియోను క‌ట్ చేసి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక్క ప‌దం కూడా స‌రిగ్గా మాట్లాడ‌లేరా? అంటూ స‌ద‌రు వీడియోకు బుద్ధా కామెంట్ పెట్టారు.
YS Jagan
Ugadi
Budda Venkanna
TDP
YSRCP
AP CM

More Telugu News