Andhra Pradesh: చెవిలో పూలతో బుద్ధా వెంక‌న్న‌.. విద్యుత్ చార్జీల‌పై బెజ‌వాడ‌లో వినూత్న నిర‌స‌న‌

budda venkanna veriety agitation on current charghes
  • విద్యుత్ చార్జీల‌పై కొన‌సాగుతున్న టీడీపీ నిర‌స‌న‌లు
  • విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వినూత్న ఆందోళ‌న‌లు
  • చెవిలో పూలు పెట్టుకుని బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా నిర‌స‌న‌
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పెంచిన విద్యుత్ చార్జీల‌పై విప‌క్షం టీడీపీ వినూత్న నిర‌స‌న‌ల‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. నేటి నుంచి వారం పాటు నాన్ స్టాప్‌గా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యించ‌గా..ఆ నిర్ణ‌యం మేర‌కే విజ‌య‌వాడ‌లో పార్టీ శ్రేణులు నిర‌స‌న‌ల‌ను హోరెత్తిస్తున్నాయి. శ‌నివారం ఉగాది ప‌ర్వ‌దినం అయిన‌ప్ప‌టికీ టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్టాయి.

ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజకవ‌ర్గంలో పార్టీ నేత‌లు బుద్ధా వెంక‌న్న, నాగుల్ మీరాలు వినూత్న నిర‌స‌న‌కు దిగారు. చెవిలో పూలు పెట్టుకుని ప్ర‌త్య‌క్ష‌మైన టీడీపీ నేత‌లు.. విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించేదాకా నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తామంటూ ప్ర‌తిన‌బూనారు. బుద్ధా వెంక‌న్న చెవిలో పూలు పెట్టుకుని క‌నిపించ‌డంతో పార్టీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఆందోళ‌న‌ల్లో పాలుపంచుకున్నారు.
Andhra Pradesh
TDP
Budda Venkanna
Vijayawada

More Telugu News