Vijay Devarakonda: ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda explains his experience with Mike Tyson
  • లైగర్ షూటింగ్ పూర్తి
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం
  • పూరీ జగన్నాథ్ తో 'జనగణమన' చేస్తున్న విజయ్
  • మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి

ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. 

లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 

మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News