ఏపీలో 202కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

  • ఏపీలో నిన్న 251 యాక్టివ్ కేసులు
  • గత 24 గంటల్లో 9,394 కరోనా పరీక్షలు
  • 28 కొత్త కేసుల నమోదు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు
ఏపీలో నిన్న 251గా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు, నేడు 202కి తగ్గాయి. గడచిన 24 గంటల్లో 9,394 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 4 కేసులు గుర్తించారు. 

అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.


More Telugu News

Active Cases Andhra Pradesh Corona Virus Daily Update