: ఆయన గత శతాబ్దానికి ఒకే ఒక్కడు!

ప్రపంచంలో 19వ శతాబ్దంలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా...? అంటే కేవలం ఒకే ఒక్కడున్నాడు. ఆయనే జిరొమన్‌ కిమురా. ఈయనే ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి. అంటే... ప్రపంచంలోని అందరికీ తాతయ్యన్నమాట. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వయసు గణాంక పరిశోధక విభాగం ప్రపంచ వ్యాప్తంగా బతికివున్న అత్యంత వృద్ధుల వివరాలను సేకరించి వెల్లడించింది. ఈ వివరాల్లో అందరికంటే అత్యంత పెద్ద వయస్కుడిగా 116 ఏళ్ల కిమురా నిలిచాడు. అంతేకాదు, ఇతనే 19వ శతాబ్దానికి చివరి వాడుగా కూడా రికార్డు సాధించాడు.

జిరొమన్‌ కిమురా 1897 ఏప్రిల్‌ 19న జన్మించాడట, తపాలాశాఖలో సుమారు 45 ఏళ్ళ పాటు సేవలందించి 1962లో పదవీ విరమణ చేశాడు. తన జీవిత కాలంలో ఇప్పటికి నలుగురు చక్రవర్తులను, 61 మంది ప్రధానుల పరిపాలనను చూశాడు. ప్రస్తుతం 83 ఏళ్ల కుమారుడి భార్యతోబాటు, 59 ఏళ్ల తన మనుమడి భార్యతో కలిసి క్యొటాంగోలో ఉంటున్నారు. తాను చిరకాలం దీర్ఘాయుష్కుడిగా జీవించడానికి కారణం మితాహారం తీసుకోవడం, ఇంకా పడకగదిలో ఎక్కువ సమయం గడపడమేనని ఈ తాతగారు చెబుతున్నారు.

అయితే, ఇది పురుషులకు సంబంధించిన లెక్క. మరి మహిళలకు సంబంధించిన విభాగంలో ఇప్పటి వరకూ 1901 జనవరికి మందు పుట్టిన వారు ప్రపంచవ్యాప్తంగా 21 మంది ఉన్నారట. వీరిలో అత్యంత వృద్ధురాలు జపాన్‌ దేశానికి చెందిన 115 ఏళ్ల మిసావో ఒకావా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తానికి ప్రపంచానికి తాతగారిగా కిమురా, అవ్వగారిగా ఒకావా నిలిచారన్నమాట!

More Telugu News