Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య రెహమ్ ఖాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Imran Khans I have everything ex wife Reham Khans reply
  • మీకు లేనిదల్లా తెలివితేటలే
  • మీరు పీఎంగా లేనప్పుడే పాక్ బాగుంది
  • ట్విట్టర్ లో విమర్శల పోస్ట్ లు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ విమర్శలతో తూలనాడారు. ఇమ్రాన్ ఖాన్ కు లేనిదల్లా తెలివితేటలేనని దెప్పి పొడిచారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటూ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయి, పదవీ గండాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భగవంతుని అనుగ్రహంతో  తనకు కొత్తగా ఏమీ అక్కర్లేదంటూ.. పేరు, సంపద ఇలా జీవితంలో అన్నీ పొందానని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ ప్రసంగంపై రెహమ్ ఖాన్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయాలతో ఆమె ఏకీభవించారు. ‘‘నిజమే మీరు ప్రధానిగా లేని సమయంలోనే పాకిస్థాన్ ఎంతో మంచి స్థితిలో ఉంది’’ అంటూ రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ బాలుడిగా ఉన్నప్పుడే పాకిస్థాన్ అభివృద్ధి చెందినట్టు చెప్పారు. తాను చివరి నిమిషం వరకు రాజీనామా చేసేదే లేదని ఇమ్రాన్ ఖాన్ భీష్మించి కూర్చోవడం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ ను 2014లో రెహమ్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో వేరు పడ్డారు.
Imran Khan
ex wife
Reham Khan

More Telugu News