Amitabh Bachchan: గంగా హారతిలో పాల్గొన్న బాలీవుడ్ బాద్ షా అమితాబ్

Amitabh Bachchan visits Rishikesh performs puja and aarti at ghat
  • రిషికేష్, ఉత్తరాఖండ్ లో పర్యటన
  • స్వామి చిదానంద సరస్వతి తోడుగా గంగమ్మకు హారతి
  • గంగ దైవత్వాన్ని ప్రేరేపిస్తుందని బ్లాగ్ లో పోస్ట్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే రిషికేష్, ఉత్తరాఖండ్ లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరాయి. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ రిషికేష్ లో పరమార్థ్ గంగా హారతి, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పరమార్థ్ నికేతన్ ప్రెసిడెంట్ స్వామి చిదానంద సరస్వతి వెంట హారతి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (వీడియో)

అమితాబ్ తన బ్లాగులోనూ ఇందుకు సంబంధించి ఫొటోను షేర్ చేశారు. ‘‘గంగ దైవత్వాన్ని ప్రేరేపిస్తుంది. మరెవ్వరూ చేయలేని విధంగా ఆత్మను ఆలింగనం చేసుకుంటుంది. మానవాళికి తెలియని రీతిలో భావోద్వేగాలు కలిగిస్తుంది’’ అంటూ అమితాబ్ తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ ఇటీవలి తన షూటింగ్ ఫొటోలను సైతం అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. గుడ్ బై చిత్రంలో రష్మిక మందన్నా, అమితాబ్ కనిపించన్నారు.
Amitabh Bachchan
Rishikesh
puja
ganga harathi

More Telugu News