Bhanu Prakash Reddy: చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి

Jagan spoiling state says Bhanu Prakash Reddy
  • పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు
  • ఫ్యాన్ స్విచ్ వేసేందుకు కూడా భయపడుతున్నారు
  • జగన్ వారం రోజులు గుడిసెల మధ్య నివసించాలన్న భానుప్రకాశ్ రెడ్డి 

కరెంట్ ఛార్జీల పెంపు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ అధికార పత్రినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని... ఫ్యాన్ స్విచ్ వేసేందుకు కూడా భయపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు పెద్ద షాక్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఏపీని అవినీతిప్రదేశ్, అంధకారప్రదేశ్ గా మారుస్తున్నారని విమర్శించారు. 

కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జనాల నడ్డి విరుస్తున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్ ను వదిలి జగన్ బయటకు రావాలని... ప్రజలతో కలిసి వారం రోజుల పాటు గుడిసెల మధ్య నివసించాలని సలహా ఇచ్చారు. జనాల్లోకి వస్తే వారి బాధలేంటో అర్థమవుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News