Arvind Kejriwal: రేపు హస్తినకు తమిళనాడు సీఎం స్టాలిన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ప్రత్యేక భేటీ

- ఢిల్లీలో కేజ్రీవాల్, స్టాలిన్‌ల భేటీ
- ఆపై ఉమ్మడిగా పాఠశాలలు, ఆసుపత్రుల తనిఖీలు
- బీజేవైఎం దాడి తర్వాత కేజ్రీతో స్టాలిన్ భేటీపై సర్వత్ర ఆసక్తి
ఏప్రిల్ 1న దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేజ్రీవాల్‌తో భేటీ కోసమే స్టాలిన్ హస్తిన టూర్ పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తనతో భేటీకి ఢిల్లీ రానున్న స్టాలిన్‌తో కలిసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను తనిఖీ చేయనున్నారు. కేజ్రీ ఇంటిపై బీజేపీ యువజన విభాగం (బీజేవైఎం) శ్రేణులు దాడికి దిగిన తర్వాత కేజ్రీవాల్‌తో స్టాలిన్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.