Sudheer Reddy: బాల్క సుమన్ ఓ బానిస: టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి

Balka Suman is a slave for KCR family says Sudheer Reddy
  • రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు
  • బాల్క సుమన్ బెదిరిస్తే బెదిరే వాళ్లం కాదు
  • నీ నియోజకవర్గం గురించి మాట్లాడదామా? అంటూ ప్రశ్నించిన సుధీర్ 

తెలంగాణలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన విమర్శలకు టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ బెదిరిస్తే బెదిరే వాళ్లం కాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ ఒక బానిస అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ నీ సొంత నియోజకవర్గంపై మాట్లాడదామా? అని సవాల్ విసిరారు. డ్రగ్స్, విద్యుత్, సంక్షేమ పథకాలపై తాము ఇప్పటికే సవాల్ విసిరామని... అయితే ఇంతవరకు సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News