Kendra Lust: టీమిండియా పేసర్ పై అమెరికన్ పోర్న్ స్టార్ ప్రశంసలు

American adult star Kendra Lust appreciates Team India pacer Mohammad Shami
  • ఐపీఎల్ లో గుజరాత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ
  • లక్నోపై సూపర్ బౌలింగ్
  • అభినందించిన కెండ్రా లస్ట్
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఈసారి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షమీ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 3 వికెట్లుతో సత్తా చాటాడు. షమీ ఈ స్థాయిలో ప్రదర్శన కనబర్చడం అభిమానులకు కొత్తేమీ కాదు. టీమిండియాకు ఆడేటప్పుడు కూడా షమీ ఇదే నిబద్ధత, ప్రతిభ ప్రదర్శించేవాడు. అయితే, అనుకోని రీతిలో ఓ అమెరికన్ పోర్న్ స్టార్ టీమిండియా పేసర్ షమీపై ప్రశంసలు జల్లు కురిపించింది. 

ఆమె పేరు కెండ్రా లస్ట్. నీలి చిత్రాల తారగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, ఆమె తనను తాను క్రీడాభిమానిగా చెప్పుకుంటుంది. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ లోనూ తాను క్రీడా ప్రేమికురాలిని పేర్కొంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనంతరం కెండ్రా లస్ట్ స్పందిస్తూ... "నిజంగా అద్భుతమైన ప్రదర్శన కనబర్చావు షమీ" అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు వేలాదిగా లైకులు, రిప్లైలు రావడం విశేషం.
.
Kendra Lust
Mohammad Shami
Gujarat Titans
Lucknow
IPL

More Telugu News