Mekapati Goutham Reddy: ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి?

Mekapati Goutham Reddy wife Sri Keerthi ready to enter politics
  • శ్రీకీర్తిని బరిలోకి దించాలని యోచిస్తున్న వైసీపీ అధిష్ఠానం
  • ఏ నిర్ణయమూ తీసుకోని మేకపాటి కుటుంబ సభ్యులు
  • శ్రీకీర్తి బరిలోకి దిగితే పోటీ నుంచి తప్పుకోనున్న టీడీపీ!
ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గౌతంరెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో శ్రీకీర్తిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, మేకపాటి కుటుంబం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెబుతున్నారు. 

వైసీపీ కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంది. ఆత్మకూరు విషయంలోనూ అదే పాటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.
Mekapati Goutham Reddy
Sri Keerthi
Nellore District
Atmakur
TDP
YSRCP

More Telugu News