Gopichand: 'పక్కా కమర్షియల్' రిలీజ్ డేట్ చెప్పిన మారుతి!

Pakka Commercial release date confirmed

  • మారుతి దర్శకుడిగా 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన రాశి ఖన్నా
  • సంగీత దర్శకుడిగా జేక్స్ బిజోయ్ 
  • జులై 1వ తేదీన విడుదల  

మొదట్లో యూత్ కి నచ్చే కథలను మాత్రమే తయారు చేసుకుంటూ వచ్చిన మారుతి, ఆ తరువాత యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసి కొంతసేపటి క్రితం ప్రకటించారు. జులై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది. 

రాశి ఖన్నా తన కెరియర్ తొలినాళ్లలోనే గోపీచంద్ తో కలిసి 'జిల్' వంటి హిట్ మూవీ చేసింది. ఆ తరువాత ఆ మధ్య మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజూ పండగే' చేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరితోను కలిసి ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News