Hollywood: 63 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న హాలీవుడ్ నటుడు

Actor Alec Baldwin becoming father again
  • యోగా ట్రైనర్ హిలేరియాను రెండో పెళ్లి చేసుకున్న అలెక్ బాల్డ్విన్
  • వీరికి ఇప్పటికే ఆరుగురు సంతానం
  • తమ కుటుంబంలోకి కొత్త అతిథి రాబోతున్నట్టు ప్రకటించిన అలెక్
ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్ బాల్డ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. తన కుటుంబంలోకి కొత్త అతిథి రాబోతున్నట్టు 63 ఏళ్ల అలెక్ తెలిపాడు. తనకంటే 25 ఏళ్ల చిన్నదైన అమెరికన్ యోగా ట్రైనర్ హిలేరియాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఆరుగురు సంతానం ఉన్నారు. 

కొత్త అతిథితో తమ కుటుంబం సంపూర్ణమవుతుందని అనుకుంటున్నామని ఈ సందర్భంగా హిలేరియా సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించింది. తాము ఎంతో సంతోషంలో ఉన్నామని చెప్పింది. అలెక్ మిషన్ ఇంపాజిబుల్, రస్ట్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో అలరించాడు. 

మరోపక్క, గత కొన్నేళ్లుగా ఈ నటుడు ఒక వివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒక సినిమా షూటింగ్ లో గన్ తో ఒక నటుడిని కాల్చి చంపాడు. దర్శకుడిని గాయపరిచాడు. ఈ ఘటన అప్పట్లో హాలీవుడ్ లో పెను సంచలనాన్ని రేకెత్తించింది.
Hollywood
Alec Baldwin
Hilaria Baldwin

More Telugu News