Tollywood: బన్నీ, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

Koratala To Direct Movie With Allu Arjun and Dhanush
  • ప్రస్తుతం ఆచార్య సినిమాతో కొరటాల బిజీ
  • ఆ తర్వాత తారక్ సినిమా షూటింగ్
  • అది అయిపోగానే అల్లు అర్జున్, ధనుష్ తో సినిమా చేస్తారని ప్రచారం
ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో క్రేజీ కాంబోను రాజమౌళి బాక్సాఫీస్ కు పరిచయం చేశారు. దానికి థియేటర్లలో ఏ రేంజ్ లో విజిల్స్ పడ్డాయో మాటల్లో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబో గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ లు కలిసి సినిమా చేయబోతున్నారన్న హాట్ హాట్ చర్చ సాగుతోంది. 

ఆ ఇద్దరినీ కొరటాల శివ ఒకే స్క్రీన్ లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. తారక్ సినిమా పూర్తవ్వగానే.. బన్నీ, ధనుష్ లతో సినిమాను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. ఒకవేళ ఈ కాంబోగానీ ఓకే అయితే అభిమానులకు పండగే మరి!!
Tollywood
Dhanush
Kollywood
Allu Arjun
Koratala Siva

More Telugu News