Tollywood: చిరంజీవితో సినిమా అందుకే ముందుకు కదల్లేదు: పూరీ జగన్నాథ్

Chiru Making Message Oriented Movies Thats why I lost Opportunity Says Puri
  • ప్రస్తుతం ఆయన సందేశాత్మక చిత్రాలు చేస్తున్నారు
  • నేనేమో వాణిజ్య విలువలున్న కథ చెప్పాను
  • అలా సినిమా చేజారిపోయిందన్న డైరెక్టర్
‘లైగర్’తో విజయ్ దేవరకొండను డిఫరెంట్ లుక్ లో చూపించిన పూరీ జగన్నాథ్.. మళ్లీ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నారు. జేజీఎం అంటూ విజయ్ ని సైనికుడిగా పరిచయం చేయబోతున్నారు. అయితే, ఆ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో సినిమా ఎందుకు చేజారిపోయిందో వివరించారు. 

వాస్తవానికి తాను చిరంజీవికి వాణిజ్య అంశాలతో కూడిన కథ చెప్పానని, కథ ఆయనకు నచ్చినా ఓకే చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన సమాజానికి ఉపయోగపడేలా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నారని, అందుకే చిరూతో తన కథ ముందుకు కదల్లేదని అన్నారు. అలా ఆ ప్రాజెక్ట్ చేజారిందన్నారు. అప్పుడే విజయ్ దేవరకొండ కల్పించుకుని, 'చిరంజీవి సార్ తో కలిసి పూరీ ఓ సినిమాలో నటించబోతున్నారు' అంటూ ఓ హింట్ ఇచ్చారు.   

కాగా, జేజీఎం ప్రాజెక్ట్ తన ఎన్నో ఏళ్ల కల అని, విజయ్ దేవరకొండ వల్లే ఇప్పుడు ఆ కల సాకారమవుతోందని పూరీ చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ కల్పిత కథ ఇది అని పేర్కొన్నారు.
Tollywood
Puri Jagannadh
Chiranjeevi
Vijay Devarakonda

More Telugu News