Jammu kashmir: జమ్మూకశ్మీర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై మహిళ బాంబు దాడి

Woman In Burqa Throws Bomb At Security Camp In Jammu kashmir
  • సోపోర్ లోని సీఆర్పీఎఫ్ బంకర్ వద్ద దాడి 
  • సంబంధిత వీడియో నెట్టింట్లో వైరల్ 
  • దాడికి పాల్పడిన మహిళ గుర్తింపు 
  • త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న ఐజీపీ 
జమ్మూ కశ్మీర్ లోని సోపోర్ లో సీఆర్పీఎఫ్ బంకర్ వద్ద ఓ మహిళ బాంబు దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఎవరికీ ప్రాణ నష్టం, గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. 

బుర్ఖా ధరించి వచ్చిన మహిళ తన బ్యాగులో ఉన్న బాంబును బయటకు తీసి క్యాంపు వైపు విసిరి పరారైంది. దాడికి పాల్పడిన మహిళను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 

మరోవైపు శ్రీనగర్ లోని రైనావారి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తాయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇందులో మాజీ జర్నలిస్ట్ రయీస్ అహ్మద్ భట్ సైతం ఉన్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.
Jammu kashmir
Woman
Burqa
Bomb
attack

More Telugu News