: అభివృద్ధికి కేరాఫ్ ఆష్ట్రేలియా!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆష్ట్రేలియా దేశం అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఆ దేశంలోని ప్రజలు ఎంతో ఆనందకరంగా జీవిస్తున్నారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజల మెరుగైన జీవన సూచి ఆధారంగా 'ఆర్ధిక సహకారం. అబివృద్ధి సంస్థ' (ఏఈసీడీ) ఆయా దేశాలకు ర్యాంకులను ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో ఆష్ట్రేలియాకు మొదటి స్థానం లభించింది.
ఈ దేశాల్లోని ప్రజల ఇల్లు, ఆదాయం, ఉద్యోగం, సమాజం, విద్య, ఆరోగ్యం, జీవితంలో సంతృప్తి వంటి పలు అంశాల ప్రాతిపదికన ఈ జీవన సూచీని సంస్థ లెక్కించింది. ఇందులో ఆష్ట్రేలియాలోని ప్రజలు 84 శాతం మంది తాము ఎంతో సంతృప్తిగా జీవిస్తున్నట్లు తెలిపారట. అంతేకాదు, ఈ దేశంలో దాదాపు 73 శాతం మంది ప్రజలు ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా సగటున ప్రతి కుటుంబీకుడు 28,884 డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాడనే విషయాన్ని కూడా ఈ సంస్థ తేల్చి చెప్పింది. స్వీడన్, కెనడా, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా, డెన్మార్క్, నెదర్లాండ్, ఐస్‌ల్యాండ్, బ్రిటన్ దేశాలు ఆష్ట్రేలియా తరువాత స్థానంలో నిలిచాయని బీబీసీ న్యూస్ ఛానల్ పేర్కొంది.